Syria: 'సేవ్ ద చిల్డ్రన్' సర్వేలో వెల్లడి..! 7 d ago
సిరియాలో 14 సంవత్సరాల అంతర్యుద్ధం కారణంగా పరిస్థితులు చాలా క్లిష్టంగా మారాయి. బషర్ అల్-అసద్ ప్రభుత్వ పతనం తరువాత, దేశం తిరుగుబాటుదారుల చేతుల్లో ఉంది. ఈ నేపథ్యములో, 'సేవ్ ద చిల్డ్రన్' అనే చారిటీ సంస్థ చేసిన తాజా సర్వేలో, సిరియాలో సగం మంది చిన్నారులు పాఠశాల విద్యకు దూరంగా ఉన్నట్లు వెల్లడైంది. ఛారిటీ డైరెక్టర్ రాషా ముష్రెజ్, యుద్ధం కారణంగా పిల్లలు ఎంతో కాలంగా విద్యను కోల్పోయారని , ప్రస్తుతం 37 లక్షల మంది పిల్లలను పాఠశాలలో చేర్పించాల్సి ఉందని వెల్లడించారు.